-->

పురాతన హిందూ దేవాలయాలు యొక్క విశిష్టత

పురాతన హిందూ దేవాలయాలు యొక్క విశిష్టతను మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

1. మీనాక్షి టెంపుల్ : తమిళనాడులోని మధురై పట్టణంలో ఉంది ఈ దేవాలయంలో అనేక స్మారకాలు భారతీయ సంస్కృతికి అద్భుతమైన శిల్పా కళాకృతులను కలిగి ఉంది ఈ దేవాలయంతమిళ సంస్కృతికి ఒక చిహ్నంగా భావిస్తున్నారు ఈ దేవాలయం 33 వేల శిల్పకళాకృతులను కలిగి ఉంది

2. బృహదీశ్వర టెంపుల్ : ఈ దేవాలయం తమిళనాడులోని తంజావూర్ లో ఉంది మధ్యాహ్న సమయంలో దేవాలయపు గోపురం నీడ క్రింద పడదు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయం

3. లింగరాజు టెంపుల్ : ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో ఉంది దీనిని శివునికి అంకితం చేయబడిన ఆలయంగా చెప్పవచ్చు ఈ దేవాలయపు గోడలపై కొన్ని వేల శివలింగా కృతులు చెక్కబడి ఉంటాయి.

4. అక్షరధామ్ టెంపుల్ : అక్షరధామ్ టెంపుల్ ఢిల్లీలో ఉంది సుమారు 100 ఎకరాల సువిసాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయంగా చెప్పవచ్చు న్యూఢిల్లీలోని ఈ ఆలయాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ జాతికి అంకితం చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది

5. కోణార్క్ సూర్యదేవాలయం : ఒడిస్సా లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలో ఒకటి ఇది చంద్ర భాగ నది తీరాన ఉంది. ఈ ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించారు. ఇక్కడి ఆలయంలో ఉండే రథచక్రాలపై పడే నీడను బట్టి సమయాన్ని తెలుసుకోవచ్చు.

6. శ్రీ స్వామి నారాయణ మందిర్ : గుజరాత్ లో ఉంది అక్షరధామ్ టెంపుల్ కింద అభివర్ణిస్తారు వేద నిర్మాణ సూత్రాలు కనుగొనంగా మందిరంలో ఎక్కడ ఉక్కు  లేదా ఇనుము ఉపయోగించబడకుండా నిర్మించారు రాళ్లను మాత్రమే ఉపయోగించి ఈ దేవాలయాన్ని నిర్మించారు.

7. అనంత పద్మనాభస్వామి దేవాలయం : ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది.పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా
పిలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్ర చర్చనీయాంశమైంది. కొన్ని లక్షల కోట్లు విలువ ఉంటుందని
అంచనా వేశారు

8. కైలాశ ఆలయం : మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు సమీపంలో ఉన్న ఎల్లోరా గుహల్లో ఉంది ఈ ఆలయం రాళ్లు, సిమెంట్ వంటివి ఏవీ ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకం. పైగా దీన్ని కొండ దిగువ భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందికి చెక్కుకుంటూ వెళ్లడం మరో అద్భుతం. కైలాస టెంపుల్ ఇటుకలతోనూ.. రాళ్ళతోనూ కట్టిన కట్టడం కాదు.. పూర్తిగా ఒక కొండను తొలచి ఆలయంగా నిర్మించారు.

9. బాదామి గుహ దేవాలయాలు : భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్ జిల్లాలో బాదామి పట్టణంలో ఉన్నాయి. నాలుగు గుహ దేవాలయాలు కొండ యొక్క ఏకశిలా రాతి ముఖంలో చెక్కబడ్డాయి బాదామి గుహ దేవాలయాలు కొండపై మృదువైన బాదామి ఇసుకరాయితో చెక్కబడ్డాయి

10. లేపాక్షి : హిందూపురం పట్టణం నుంచి 15 కి.మీ, దూరంలో ఉంటుంది. 70 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక్క స్తంభం మాత్రం నేలకు ఆనుకొని ఉండదు. ఈ గుడిలో వున్నా అన్ని స్తంభాల కిందా ఆధారానికి అనుకోని ఉంటే ఒక్క స్తంభం మాత్రం కిందా ఆధారం లేకుండా వుంది, ఈ స్తంభం కిందా సుమారు పావు అంగుళం మేర స్తంభం అడుగు భాగానికి కిందనున్న ఆధారానికి మధ్య ఖాళీ ఉంటుంది ఈ వేలాడే స్తంభమే ముఖ్య ఆకర్షణగా సందర్శకులను ఆకట్టుకొంటోంది 

  

 



విశాఖలో వింత జాతర







12 సంవత్సరాలకు ఒకసారి ఆ శివాలయం పై పిడుగు పడుతుంది.. కారణం

సొరకాయ స్వామి దేవాలయం


పంచముఖి ఆలయం


Post a Comment

0 Comments